top of page

 

పుట్టినప్పుడు ఎలా ఉన్నాగానీ, మొత్తం మహిళలు అందరూ అద్భుత

 

సౌందర్యరాశులుగా మారిపోవాలంటే ఏమి చెయ్యాలి?

 

ఈ వ్యాసంలో కొన్ని భాగాలు మీరు అసహ్యించుకొనేలా, నన్ను అపార్ధం చేసుకునేలా ఉంటాయి. అందుకు ముందుగానే నా క్షమాపణలు. పరిశోధకులు ఎప్పుడూ ఇతరుల మెప్పుకోసం వ్రాయకూడదు. ఏది వాస్తవమో అదే వ్రాయాలి. కానీ, నిజం ఎప్పుడూ మనల్ని బాధిస్తుంది. వాస్తవం కఠోరంగానే ఉంటుంది. అందుకు సిద్ధమైతేనే చదవండి!

మొదటి పాఠం:

అవి నేను కాలేజిలో చదువుకునే రోజులు. నా ఫ్రండ్స్ లో చాలా మందికి ఒక గొప్ప కళ ఉండేది. అదేంటంటే, నేను స్నేహితులతో బస్టాప్ లో నిలబడినప్పుడు, వారికి కనిపించిన మహిళలలో ఎవరైనా కాల్ గర్ల్స్ (వ్యభిచారిణిలు) ఉంటే, వారిని చూసిన మొదటి చూపులోనే గుర్తించగలిగేవారు. ఒక అమ్మాయి కాల్ గర్ల్ అన్న విషయం చూడగానే మీకు ఎలా తెలిసిపోతుంది అని నేను వార్ని ఎన్నిసార్లు ప్రశ్నించినా, వారెప్పుడూ ఆ రహస్యాన్ని చెప్పలేకపోయేవారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వారు ఎలా గుర్తించగలుగుతున్నారో వారికి కూడా తెలీదు. కొద్ది రోజులకు ఆ కళ నాకు కూడా అబ్బింది. నేను కూడా బస్టాప్ లో కాల్ గర్ల్ ని ఒకే ఒక్క చూపుతో గుర్తించగలుగుతున్నాను. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వారిని నేను ఎలా గుర్తించగలుగుతున్నానూ అంటే, నాకు కూడా తెలీదు.

ఒక 10 సంవత్సరాలు గడిచిపోయాయి. బస్టాప్ లలో లేక మరెక్కడైనా కానీ కాల్ గర్ల్స్ నా ముందుకి వచ్చి నిలబడినా కానీ, నేను వారిని గుర్తించలేకపోయేవాడిని. వారిని గుర్తించే కళ నాకు పోయిందేమో అనుకున్నాను.

మరో పది సంవత్సరాలు గడిచిపోయాయి. చాలా ఆశ్చర్యకరంగా, ఇప్పుడు నాకు నా బంధువులలో, స్నేహితులలో, ఇరుగుపొరుగు వారిలో కూడా కాల్ గర్ల్స్ కనిపించేస్తున్నారు. నేనెందుకు ఇలా పొరబడుతున్నానో నాకు అర్ధం కాలేదు. కానీ, నేను ఇప్పుడు ఇంతకు ముందులా ఒక చిన్న కాలేజి కుర్రాడిని కాదు. నేను ఇప్పుడు ఒక పరిశోధకుడిని, రచయితను కూడా. నా చుట్టూ ఉన్న మంచి కారెక్టర్ ఉన్న సంసారిక స్త్రీలు కూడా నాకు కాల్ గర్ల్స్ లా ఎందుకు కనిపిస్తున్నారో పరిశోధించటం మొదలు పెట్టాను. ఇప్పుడు నేను చేధించిన ఆ గొప్ప రహస్యాన్ని మీతో పంచుకుంటాను.

ఈ సమాజం మొత్తం అత్యంత అసహ్యించుకునే పనిని మనం చెయ్యాల్సి వస్తే? ఆ పనిని రహస్యంగా కాకుండా, మన చుట్టూ ఉన్నవారికి తెలిసిపోయేలా చెయ్యాల్సి వస్తే? ఆ జుగుప్సాకరమైన మరియూ మన కుటుంబం పరువంతాపోయే పనిని ప్రతిరోజూ చేయాల్సివస్తే? అప్పుడు మనల్ని మనం ఎంతగా అసహ్యించుకుంటామో కదా? ఒక వ్యక్తి తన బ్రతుకుని ఎంత ఎక్కువగా అసహ్యించుకుంటే అంత ఎక్కువగా ఆ లక్షణాలు ఆ వ్యక్తి ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆ వ్యక్తియొక్క "ఆరా", అంటే, మన ఆత్మశక్తికి మాత్రమే కనిపించే ప్రతి మనిషి చుట్టూ ఉండే ఒకరకమైన వెలుగు, ఆ వ్యక్తి ఎంత ఎక్కువగా తన జీవితాన్ని అసహ్యించుకుంటే, అంత ఎక్కువగా ఆ "ఆరా" క్షీణించిపోతుంది. మనందరమూ కూడా కొన్ని పనులు మనకు నచ్చకపోయినా, తప్పనిసరి పరిస్థితులలో చేస్తుంటాం. అంతమాత్రాన మన "ఆరా" ఎదుటివారు తేలిగ్గా గుర్తించగలిగేంతగా క్షీణించదు. కానీ, ఒకప్పుడు వ్యభిచారం చేసే స్త్రీలు మాత్రం తమ జీవితాల్ని తామే విపరీతంగా అసహ్యించుకుంటూ బ్రతుకుని వెళ్ళదీసేవారు కనుక, ఎవరుపడితే వారు అలాంటి స్త్రీలను తేలిగ్గా గుర్తించగలిగేవారు.

మరి కొత్త జనరేషన్ కాల్ గర్ల్స్ ని మనం వారి ముఖం చూసినా ఎందుకు గుర్తించలేకపోతున్నాం? ఎందుకంటే, ఒకప్పుడు స్త్రీలను బలవంతంగా ఆ రొంపిలోకి కొంతమంది క్రిమినల్స్ దించేవారు. కానీ, ఇప్పుడలా కాదు. చాలామంది అమ్మాయిలు ఇష్టపూర్వకంగా ఈ వృత్తిని స్వీకరిస్తున్నారు. వారి దృష్టిలో, ఒక సాఫ్ట్ వేర్ జాబ్ ఎలాంటిదో, వ్యభిచార వృత్తికూడా అలాంటిదే! మన మనసుకి సమాధానం చెప్పుకోగలిగినప్పుడు, మనకి బాగా తెలిసిన వ్యక్తులకు తెలీకుండా చేయగలిగినప్పుడు, అత్యంత అసహ్యకరమైన పనిని చేసినాకూడా, మన ముఖంలో కళ (ఆరా) క్షీణించదు.

అలాగైతే, నాకు నా చుట్టూ ఉన్న పరిచయస్తుల్లో కొంతమంది కాల్ గర్ల్స్ లా ఎందుకు కనిపిస్తున్నారు? ఎందుకంటే, ఈ కొత్త జనరేషన్లో మంచి కారెక్టర్ ఉన్న కొంతమంది సంసార స్త్రీలు తమ జీవితాల్ని ప్రతీ క్షణం అసహ్యించుకుంటూ బ్రతుకుతున్నారు. అందుకే వారి ముఖంలో కళ తప్పుతుంది.

మీ ముఖ సౌందర్యం వెలిగిపోవటానికి మొదటి రహస్యం ఏమిటంటే, మీ జీవితాన్ని ఇష్టపడటం మొదలుపెట్టండి. ముందుగా మీరు అసహ్యించుకుంటూ చేసే పనుల లిస్టుని ఒక పేపర్ పై వ్రాయండి. మీ భర్త మరియూ ఇతర కుటుంబ సభ్యుల దృష్టికి మీ సమస్యను తీసుకువెళ్ళి, వారితో మీరు తయారుచేసిన లిస్టులోని కొన్ని పనులను మీరు చేయకుండా ఉండే అవకాశలను చర్చించండి. ఆ లిస్టులో కొన్ని పనులు మీకు తప్పక పోవచ్చు. అప్పుడు మీ ముందున్న ఏకైక పరిష్కారం, మీరు చేసే ప్రతీ పనినీ ఇష్టపడటమే. లేదా, కనీసం ఆయా పనులపై మీకున్న అసహ్యాన్ని వీలున్నంత తగ్గించుకోండి. గుర్తుంచుకోండి, మన దేశ ప్రధాని భార్య ఐనా, అంబానీ భార్య ఐనా కూడా, వారు కూడా వారి మనసుకి నచ్చని కొన్ని పనులను చేయాల్సి రావొచ్చు.

 


రెండో పాఠం:

ఇది నా సొంత పరిశోధన కాదు. ఎక్కడో చదివిన ఒక మంచి పరిశోధన. మీరు మీ భర్తతో లేదా కుటుంబంతో లేదా స్నేహితులతో హాలిడే ట్రిప్ కి వెళ్ళారనుకోండి. ఆ ట్రిప్ మీకు ఒక గొప్ప మధురానుభూతిని మిగిల్చింది అనుకోండి. ఆ సమయంలో మీ మెదడులో ఒక గొప్ప రసాయన క్రియ జరుగుతుంది. అదే మీ ఆనందానికి కారణం. కొన్ని రోజుల తరువాత, ఏకాంతంగా ఆ ట్రిప్ మొదలైనప్పటినుంచీ, పూర్తయినవరకూ ప్రతీ సంఘటననూ అదే వరుసలో గుర్తు చేసుకున్నారనుకోండి. మీరు గతంలో నిజంగా హాలిడే ట్రిప్ కి వెళ్ళినప్పుడు మీ మెదడులో జరిగిన రసాయన క్రియ, కేవలం ఆ ట్రిప్ ని యధాతధంగా గుర్తుచేసుకున్నప్పుడు కూడా సరిగ్గా అదే రసాయన క్రియ మళ్ళీ జరుగుతుంది. తద్వారా మీరు మళ్ళీ ఇంకోసారి ఆ హాలిడే ట్రిప్ కి వెళ్ళకుండానే, వెళ్ళినప్పుడు పొందినంత ఆనందాన్ని పొందవచ్చు అని శాస్త్రవేత్తలు నిరూపించారు.

ఈ సూత్రం మీ జీవితంలో మీకు జరిగిన అవమానాలకూ, బాగా బాధించే సంఘటనలకూ కూడా వర్తిస్తుంది. మీ మనసుపడే బాధకు కూడా మీ మెదడులో జరిగే రసాయన క్రియే కారణం. మనందరం, ముఖ్యంగా మహిళలు చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే, ఎక్కువగా బాధించే సంఘటనలను పదేపదే గుర్తుచేసుకోవటం, సంతోషకరమైన సంఘటనలను మాత్రం త్వరగా మర్చిపోవటం. దీని ప్రభావం మీ ముఖ వర్చస్సు మీద ప్రతిఫలిస్తుంది. అందంగా కనిపించాలంటే, ఏ సంఘటనను మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకోవాలో, ఏ సంఘటనను పూర్తిగా మర్చిపోవాలో ఇప్పుడు మీకు అర్ధం అయ్యిందా?

 


మూడో పాఠం:

ఈ మూడో పాఠం ఆధునిక మహిళకు నచ్చకపోవచ్చు. ఇది వేదాలను పరిశోధించటం ద్వారా నేను కనుక్కున్న విషయం. వర్జినిటీ అన్నది అమ్మాయిలకు మాత్రమే సంబంధించిన విషయం. మగాళ్ళు ఎంతమందితోనైనా తిరగొచ్చు. మహిళలు మాత్రం జీవితాంతం ఒక్కరితోనే ఉండాలి. ఇవి మన శాస్త్రాలు ఘోషించే విషయాలు. కానీ, దీని వెనక ఉన్న మూల కారణాన్ని చెప్పకపోవటం వల్ల, మనకు ఇవన్నీ మూఢనమ్మకాలని అనిపించి, కొంతమంది మహిళలు, ఒకరికంటే ఎక్కువమంది పురుషులతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. అసలు మహిళలు ఎందుకు జీవితాంతం ఒక్కరితోనే కలిసి ఉండాలో నా పరిశోధనను మీతో పంచుకుంటాను.

మనుషులు చేసే పనులను ప్రభావితం చేసే మొత్తం గ్రహాల సంఖ్య 9. ఈ నవ గ్రహాలలో 5 గ్రహాలు ఒక గ్రూపుగా, 4 గ్రహాలు మరో గ్రూపుగా ఉంటాయి. మనం పుట్టిన లగ్నం ఆధారంగా, వీటిలో ఒక గ్రూపు గ్రహాలు మీకు మిత్ర గ్రహాలై శుభం చేసేవిగా, మరో గ్రూపు గ్రహాలు మీకు శతృగ్రహాలై, కీడు చేసేవిగా ఉంటాయి. మగవారిలో, జన్మించినప్పటి నుంచీ, మరణించే వరకూ కూడా, వారి గ్రూపు గ్రహాలలో ఎలాంటి మార్పూ ఉండదు. కానీ, అమ్మాయిల విషయానికి వస్తే, వివాహం తరువాత, వారు ఎవరిని పెళ్ళిచేసుకుంటే, ఆ వ్యక్తికి చెందిన శుభగ్రహాలు ఈ అమ్మాయికి కూడా శుభ గ్రహాలుగా మారిపోతాయి. అలాగే, కీడు చేసే గ్రహాలు కూడా. అందుకే, వివాహానంతరం అమ్మాయి ఇంటిపేరు మార్చే సాంప్రదాయం వచ్చింది. ఒకరికంటే ఎక్కువమంది పురుషులతో సంబంధం పెట్టుకున్న స్త్రీకి మొత్తం తొమ్మిది గ్రహాలూ కూడా శతృగ్రహాలుగా మారిపోయి, ఆమె జీవితంలో అదృష్టం తగ్గిపోతుంది. అలాగే భర్త చనిపోయిన తరువాత కూడా ఆమెకు మొత్తం 9 గ్రహాలూ కీడు చేసేవిగా మారిపోతాయి. అందుకే, భర్త చనిపోయాక బొట్టూ, పువ్వులూ, ఆభరణాలూ తీసేసి తెల్లచీర కట్టుకోవటం లాంటి సాంప్రదాయం వచ్చింది. ఎందుకంటే, బొట్టూ, పువ్వులూ, ఆభరణాలూ, రంగు రంగుల వస్త్రాలు కట్టుకోవటం వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే - ఈ వస్తువులన్నీ గ్రహాలను ఆకర్షిస్తాయి. మనకు మంచి చేసే గ్రహాలను ఆకర్షించే వస్తువులను మాత్రమే మనం ధరించాలి. ఒకవేళ, మొత్తం 9 గ్రహాలూ మనకు కీడు చేసేవిగా మారిపోతే? పై వస్తువులన్నీ తీసేసి, ముతకగా ఉండే తెల్ల చీరను ధరించాలి. ఎందుకంటే, ఆ తెల్లచీర 9 గ్రహాలలో ఏ ఒక్క గ్రహాన్నీ ఆకర్షించదు కనుక. ఈ పనులన్నీ, మీకు ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. కనీసం, జీవితాంతం ఒకే పురుషుడితో కలిసి జీవించటం సాధ్యమే కదా? ఇప్పుడు మీ ప్రశ్న ఏమిటంటే, నాకు తెలిసిన ఒక అమ్మాయికి 10 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ అమ్మాయి చాలా సంతోషంగా ఉంది. మరి ఆ అమ్మాయి అదృష్టాన్ని గ్రహాలు ఎందుకు పాడుచెయ్యలేదూ, అని. బహుశా ఆ అమ్మాయి నెత్తిమీద ఉన్న చెడు కర్మ మనందరికంటే తక్కువ అయ్యిండవచ్చు. మంచి కర్మ ఆ అమ్మాయికి ఎక్కువ ఉండి ఉండొచ్చు. మన సంతోషం కూడా మన మొబైల్ ఫోన్ లోని బాటరీ లాంటిదే. మొత్తం చార్జింగ్ అయిపోయేంతవరకూ వెలుగుని ఇస్తూనే ఉంటుంది. ఆ వెలుగుని చూసి, మనం మరణించేవరకూ ఆ వెలుగు అలాగే ఉంటుంది అని అనుకోకూడదు.

 


ఆఖరి పాఠం:

శుభ్రంగా స్నానం చేసిన తరువాత ఒంటిపై డియోడరెంటు స్ప్రే చెయ్యాలంట. అసలు స్నానం చేసిన తరువాత కూడా ఒంటినుంచి ఎందుకు దుర్ఘంధం రావాలి? చంకలోకి వేరే స్ప్రే అంట. మర్మాంగాలకు మరొకటి. బట్టలపై మరొకటి. అదికదా, అత్యంత అందవిహీనమైన జీవితం అంటే? గుర్తుంచుకోండి, శారీరక దుర్ఘంధాన్ని జయించాలంటే, రోజుకి మూడు లీటర్ల నీరు త్రాగాలి. ఫ్రిడ్జులో పెట్టిన లేక ప్యాక్ చేసిన ఆహారాన్ని త్యజించాలి. ఎక్కువగా ఇంటిలో వండిన శాఖాహారాన్నే తినాలి. ఉదయం, రాత్రి కూడా స్టూల్సుకి వెళ్ళాలి. ప్రతిరోజూ పళ్ళు తినాలి. ఈ వ్యాస రచయిత (అంటే నేనే) ఐదు సంవత్సరాల క్రితమే టూత్ పేస్టుని వాడటం మానేసాడు. వేప పుల్లతో పళ్ళుతోముకోమని చెప్పటం లేదు. అది నాకు చాలా కష్టంగా అనిపించింది. అందుకే కేవలం ఒక అల్ట్రా సాఫ్ట్ టూత్ బ్రష్ తో ఉదయం మరియు రాత్రి పళ్ళుతోముకుంటాను. బ్రష్ మీద ఇంకేమీ ఉండదు. మీరు కూడా కనీసం కొన్ని విషయాలలో ఐనా సహజమైన పనులు చేయండి. నలుగురితో నారాయణా అంటే మాత్రం దుర్ఘంధాన్ని కవర్ చేయటానికి నాలుగు రకాల స్ప్రేలు వాడుకోండి మరి. ఎదురుపడ్డ ప్రతీ వ్యక్తికీ ఒక చిరునవ్వుని ఇవ్వండి. అంతకు మించిన ముఖ సౌందర్యం వేరే ఉంటుందా ఏమిటి? సన్నగా ఉంటే శరీరం అందంగా ఉన్నట్టే. ఇవన్నీ మీ చేతుల్లో ఉన్న పనులే కదా? ప్రయత్నించండి మరి.

మీకు నచ్చని విషయాలను చెప్పిఉంటే దయచేసి క్షమించండి. మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

విజ్ఞాపన:

నేను వ్రాసిన పుస్తకాలు ఉచితంగా ఆన్ లైనులో ఈ క్రింది వెబ్ సైటులో చదువుకోవచ్చు.


www.VEDAuniversity.com

bottom of page