top of page

గుడిలో దేవుడికి అర్పించిన ప్రసాదాన్ని దేవుడు ఎందుకు తినటం లేదు?

వేదంలో దేవుడున్నాడని ఎక్కడా చెప్పబడలేదు. ఎందుకంటే వేదం అనేది వాస్తవాలతో కూడిన స్వచ్చమైన సైన్సు. వేదిక్ సైన్సుని ఆధారం చేసుకొని తరువాత కాలంలో దేవాలయాలను నిర్మించారు. 

భూమిపై నివసించే మనుష్యులను ప్రభావితం చేయగలిగే మొత్తం గ్రహాల సంఖ్య 9. మొత్తం దిక్కుల సంఖ్య 8. అన్ని దిక్కులా అన్ని గ్రహాల ప్రభావమూ వుంటుంది కానీ, ఒకో గ్రహమూ ఒకో దిక్కువైపు అత్యధిక స్థాయిలో తన ప్రభావాన్ని చూపిస్తుంటుంది. ఉదాహరణకు, తూర్పు దిక్కుపై సూర్య గ్రహ ప్రభావం అత్యధికంగా వుంటుంది. ఆ విధంగా 8 దిక్కులకూ ఒక్కొక్క గ్రహాన్ని అధినాయకుడిగా నిశ్చయించటం జరిగింది. ఐతే, ఒక్క ఈశాన్య దిక్కుకి మాత్రం గురు గ్రహం మరియూ కేతు గ్రహమూ కూడా అధినాయకులుగా కనుగొన్నారు మన మహర్షులు.

ఏదైనా ఒక కట్టడం చతురస్రాకారంలో కట్టబడి, దాని ముఖద్వారం ఏదైనా ఒక దిక్కు యొక్క మధ్యస్థానం వైపు చూస్తున్నట్లైతే, కేవలం ఆయొక్క దిక్కుకి చెందిన గ్రహాన్ని మాత్రమే ఆ కట్టడం ఆకర్షిస్తుందనీ, ఇతర ఏ గ్రహాల ప్రభావమూ ఆ కట్టడంపై ప్రసరించదనీ వేదకాలం నాటి మన మహర్షులు కనుగొన్నారు. అలాంటి కట్టడాన్నే మనం దేవాలయము అని అంటాము.

మీ జన్మలగ్నం ప్రకారం మీకు శుభం కలుగచేసే గ్రహాలు ఏవో తెలుసుకొని, ఆ గ్రహాల ప్రభావం మీమీద అత్యధికంగా పడేలా మీ జీవనశైలి వుండాలి. మీరు ఆకాశం క్రిందకు వచ్చి ఒక గంటసేపు నిలబడ్డారంకోండి, అప్పుడు, మీమీద మొత్తం 9 గ్రహాల ప్రభావమూ పడి తీరుతుంది. ఆ 9 గ్రహాలలో మీకు చెడు చేసే దుష్ట గ్రహాలు కూడా వుంటాయి. ఐనా మన పనుల కోసం ఆరుబైటకు వస్తుంటాము. దేవాలయానికి వెళ్ళటము ద్వారా కేవలం మీరు కోరుకున్న గ్రహ ప్రభావం మాత్రమే మీమీద ప్రసరిస్తుంది. కొన్ని గంటలసేపు బయట నిలబడితే మిమ్ములని మంగళ గ్రహం ఎంత ప్రభావితం చేస్తుందో, మంగళ గ్రహాన్ని ఆకర్షించటం కోసం నిర్మితమైన ఆంజనేయస్వామివారి గర్భ గుడిలో కేవలం ఒక నిముషం సేపు నిలబడితే చాలు, ఆ కొద్దిసేపటిలోనే మీరు మంగళ గ్రహానికి విపరీతంగా ఆకర్షితులౌతారు.

ఇక అసలు విషయం ప్రసాదంలోకి వద్దాం. ప్రసాదాన్ని గుడిలో పెట్టేది దేవుడు తినటంకోసం కాదు. జన సందోహం ఎక్కువగా వుండటం వలన మీకు గర్భగుడిలో ఒక్క నిముషం కంటే ఎక్కువ వుండే అవకాశం లేదు. అందుకే గురు గ్రహాన్ని ఆకర్షించే గుడిలో గురు గ్రహం ఆకర్షణకు విపరీతంగా గురయ్యే శనగలను కానీ లేదా శనగపిండితో చేసిన లడ్డూని కానీ ప్రసాదంగా అర్పించాలి. ఒక వెయ్యి మందిని గర్భ గుడిలో పది గంటల సేపు గడిపే అవకాశాన్ని మనం కల్పించలేము. కానీ ఒక వెయ్యి లడ్డూలను గర్భగుడిలో కొన్ని గంటలసేపు వుంచి ఆ లడ్డూలను వెయ్యి మంది భక్తులకు పంచొచ్చు. అలాంటి లడ్డూని తినటం వలన ఆ లడ్డూ ఎన్ని గంటలసేపు గర్భగుడిలో గురుగ్రహ ప్రభావానికి లోనైందో అంత ప్రభావాన్ని ఆ భక్తుడు అనుభవించొచ్చు.

ఈ వైదిక శాస్త్రంపై ఎవరికీ అవగాహన లేకపోవటం వలన, ప్రజలకు దేవాలయాలపై నమ్మకం కూడా పోతున్నది. గురు గ్రహాన్ని ఆకర్షించే శనగపిండితో చేసిన లడ్డూ ప్రసాదాన్ని బుధ గ్రహాన్ని ఆకర్షించటంకోసం నిర్మించిన విఘ్నేశ్వరుడి గుడిలో ప్రసాదంగా పంచటమేమిటని ఏ పండితుడూ ప్రశ్నించడేమి? శని గ్రహాన్ని ఆకర్షించాల్సిన శివుడి విగ్రహాన్ని, ఇనుముతో చేయాల్సిందిపోయి డబ్బుంది కదా అని బంగారంతో తయారుచేస్తే, ఆ విగ్రహం శని గ్రహానికి బదులు గురు గ్రహాన్ని ఆకర్షిస్తుందని ఈ పండితులకు తెలియకపోవటం లేదా తెలిసీ పట్టించుకోకపోవటం ఎంత తప్పు?

దేవాదాయ శాఖ తక్షణ కర్తవ్యం
1- టెంపుల్ అక్రెడిటేషన్ అధారిటీని ఏర్పరిచి, నియమ నిబంధనలను పాటిస్తున్న గుడులన్నింటికీ ధృవపత్రాలు జారీ చేయటం.
2- జారీ చేసిన ధృవపత్రాన్ని ప్రతీ గుడి బయటా ప్రదర్శింపచేయటం.
3- ధృవపత్రంలో ఈ క్రింది విషయాలు సుస్పష్టంగా వ్రాసి వుండాలి:
   అ) ఆ గుడి వాస్తు ప్రకారం నిర్మితం అయినదా లేక భక్తి మార్గం కోసం నిర్మితమయినదా.
   బి) ఆ గుడి ఏ గ్రహానికి మరియూ దిక్కుకీ అనుసంధానించబడినది.

Courtesy: www.VEDAuniversity.com

bottom of page