top of page

హైస్కూలు సిలబస్ లో చేర్చాల్సిన చరిత్ర పాఠం - 1

 

మహాభారత యుద్ధ సమయంలో కర్ణుడు అర్జునుడిని హెచ్చరిస్తూ ఇలా అంటాడు: భూమిలోకి కూరుకుపోయిన రధ చక్రాన్నినేను పైకిలేపి తిరిగి నా రధాన్ని అధిరోహించేంతవరకూ యుద్ధాన్ని ఆపు, లేదంటే నేను నేలమీద నిలబడే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేస్తాను. అప్పుడు అనవసరంగా ఈ యుద్ధంలో సైన్యంతో పాటు పశు పక్ష్యాదులు కూడా మరణిస్తాయి.

ఒకే ఒక అస్త్రంతో, సైన్యంతో పాటుగా పశుపక్ష్యాదులు కూడా మరణిస్తాయని కర్ణుడుఅన్నాడు. కేవలం అణుబాంబు వల్లే అది సాధ్యం. అంటే ఆ రోజులలో బ్రహ్మాస్త్రం అంటే అణుబాంబు అన్నమాట.

1945 లో మొదటిసారిగా అణుబాంబును పేల్చిన శాస్త్రవేత్త రాబర్ట్ ఒప్పెన్ హైమర్ ను అణుబాంబును కనిపెట్టిన మొదటివాడిగా మరియూ మొట్టమొదటిసారిగా పేల్చిన వ్యక్తిగా జర్నలిస్టులు పొగిడినప్పుడు, ఒప్పెన్ హైమర్ మహాభారతంలోని భగవద్ గీత లోని (X1,12) "దివి సూర్య సహస్రస్య......" అనే సంస్కృత పద్యాన్ని చదివి వినిపిస్తాడు. ఆ పద్యానికి అర్ధం, మహాభారత యుద్ధ సమయంలో వేయి సూర్యులకాంతీ మరియూ వేడీ జనించింది అని.

మొత్తానికి ఒప్పెన్ హైమర్ చెప్పినదేమిటంటే, అణుబాంబుని తనకంటే కొన్ని వేలసంవత్సరాల క్రితమే భారతీయులు మహాభారత యుద్ధ సమయంలో ప్రయోగించారని.

జపాన్ పై అణుబాంబు ప్రయోగం వెనుక జపాన్ దేశాన్ని భయపెట్టటం మరియూ లేదా ప్రపంచానికి అమెరికన్ అణుయుద్ధ శక్తిని పరిచయంచేయటమే నిజంగా కారణాలైనప్పుడు, హిరోషిమాపై వేసిన మొదటి బాంబు సరిపోతుందని చెప్తూ, ఆ తరువాత మూడు రోజులకు రెండో బాంబుని నాగసాకిపై ప్రయోగించటాన్ని ఒప్పెన్ హైమెర్ తీవ్రంగా వ్యతిరేకించాడు.

మాట్లాడితే భగవద్గీతను ప్రస్తావించటం, రెండో బాంబు అనవసరంగా వేసినందుకు కోపంతో అణుబాంబులను నిషేధించాలని పిలుపునివ్వటం లాంటి పనులు చేస్తుండటంతో, అప్పటి అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమన్ ఇక ఎప్పటికీ ఒప్పెన్ హైమర్ తన కళ్ళబడకూడదని శ్వేతసౌధం అధికారులకు తాఖీదు కూడా ఇచ్చాడు.

మరింత సమాచారం కోసం Robert Oppenheimer Bhagavad Gita అని గూగుల్ లో వెతకండి.

www.VEDAuniversity.com

bottom of page