top of page

తెలుగులో వేదం-9

లైట్లు ఆర్పి, దీపాలు వెలిగించటాన్ని హేళన చేసేవారూ మరియూ సమర్ధించేవారికోసం ............... సమర్పిస్తోన్న వేదవిజ్ఞాన వివరణ!

నా వివరణ మొదట్లో అసంబద్ధంగా వుంటుంది, దయచేసి కాస్త ఓపిక పట్టగలరు. మీకందరికీ తెలిసినది వాల్మీకి రామాయణమైతే, చాలామందికి తెలియనిది వశిష్ట రామాయణం. ప్రపంచంలోని మనుష్యజాతి అనుభవిస్తోన్న బాధలను చూసి వైరాగ్యానికి గురైన కోసల రాజకుమారుడు శ్రీరాముడికి జీవిత సారాన్నీ, జీవితంలో వచ్చే కష్టాలను ఎలా ఎదుర్కోవాలో, చివరికి ఎలా ముక్తిని పొందాలో వశిష్ట మహర్షి చేసిన బోధనల సమాహారమే వశిష్ట రామాయణం.

ఒక కుటుంబం ఏదైనా సాధించాలన్నా, పైకి ఎదగాలన్నా, ఏదైనా కష్టాన్ని ఎదుర్కోవాలన్నా కూడా, ఆ కుటుంబ సభ్యులంతా ఉమ్మడిగా ఆలోచించాలి తప్ప, ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా అలోచించకూడదు. బాలలను పక్కన పెట్టి, కుటుంబ సభ్యులలో పెద్దవారంతా ఉమ్మడిగా ఒకే సంకల్పాన్ని కలిగి ఉన్నప్పుడు, ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవటం చాలా సులువౌతుంది. మరీ ముఖ్యంగా భార్యాభర్తల సంకల్పం ఎప్పుడూ ఒక్కటే అవాలి. ఎవరికివారే యమునాతీరే అన్నట్టు వేరు వేరు సంకల్పాలతో జీవిస్తే, వాటిని సాధించుకోవటానికి ఎన్నో విలువైనవి పోగొట్టుకోవటమేకాదు, మరెన్నో కష్టనష్టాలకు గురవ్వాల్సి వస్తుంది కూడా.

దేనినైనా సాధించటం అనేది రెండు శక్తులపై ఆధారపడి వుంటుంది. ఒకటి శారీరక శక్తి. మానసిక శక్తి కూడా శారీరక శక్తిలో భాగమే. రెండవది అధ్యాత్మిక శక్తి. శారీరక శక్తితో సాధించలేని దానిని అధ్యాత్మిక శక్తితో సాధించుకోవచ్చు. సంకల్పబలం ఎంత గట్టిగా వుంటే, అంత వేగంగా అంత విజయవంతంగా అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చు. ఎంత ఎక్కువమంది ఒక పనిని సాధించాలని సంకల్పిస్తే అంత ఎక్కువ అధ్యాత్మిక శక్తి విడుదలై వారంతా ఉమ్మడిగా సంకల్పించిన పని సుసాధ్యమౌతుంది.

ఒక వ్యాపార సంస్థ యజమాని సంపాదించిన లాభాలలో అధిక మొత్తాన్ని తానొక్కడూ మింగేసి, సంస్థ ఉద్యోగులకు చాలీచాలని జీతాలిచ్చినప్పుడు, సంస్థను లాభాల్లో నడపాలన్న యజమాని సంకల్పంతో ఉద్యోగులు ఏకీభవించకుండాపోవటమే ఆ సంస్థ దివాళాకు మొదటి మెట్టౌతుంది.

అసలు విషయంలోకి వస్తే, ఇప్పుడు మనందరి ముందూ శారీరక కష్టంతో ఎదుర్కోలేని ఒక పెద్ద కష్టం వుంది. దానిపేరే కరోనా వైరస్. సనాతన ధర్మం భారతదేశం అంతా ఒక కుటుంబమని చెప్తోంది. కనుక భారతీయులంతా సమిష్టి సంకల్పాన్ని వ్యక్తీకరించాల్సిన సమయం ఆసన్నమైంది. భారీ జనసందోహం ఒకే సంకపాన్ని చెప్పాల్సివచ్చినప్పుడు, అంతా కలిసి ఏక సమయంలో ఆ సంకల్పాన్ని వ్యక్తీకరిస్తే ఊహకుకూడా అందనంత అత్యధిక స్థాయిలో అధ్యాత్మిక శక్తి విడుదలై, వారంతా కోరుకున్న సంకల్పాన్ని నెరవేరుస్తుంది. అందుకే మీరంతా కలిసి టీవీలో చూపిస్తోన్న టైముకి అనుగుణంగా మీ మీ వాచీలను సరిదిద్దుకొని ఏప్రిల్ 5, 2020 తేదీ రాత్రి సరీగ్గా తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకూ మనసులోకి మరో భావాన్ని రానివ్వకుండా కరోనా వైరస్ ని ఎదుర్కొనే శక్తిని భారతీయులందరికీ ప్రసాదించమని సంకల్పించండి. కేవలం మీకోసమో లేదంటే కేవలం మీ ఒక్కరి కుటుంబం కోసమో ప్రార్ధిస్తే, మీ సంకల్పం వృధా ఐపోతుందని గుర్తించండి.

ఆ సమయంలో ఇంటిలోని లైట్లన్నీ ఆర్పివేసి, దీపాలూ, టార్చి లైట్లూ, మొబైల్ ఫోన్లలోని లైట్లూ వెలిగించటమన్నది కేవలం వివిధ ప్రాంతాలలో వివిధ వేషభాషలకు చెందిన మిమ్ములనందరినీ సంకల్పము చెప్పేటప్పుడు ఒక కుటుంబముగా కలిపే ఒక తంత్రము. మరియూ, సంకల్పము చెప్పే సమయంలో ఇతర ఆలోచనలు మనసులోకి రాకుండా చేయటానికి మిమ్ములను మీ ప్రధానమంత్రి లైట్లు ఆర్పడం దీపాలు వెలిగించటం అనే ఒక రిచువల్ చేయమని చెప్పివుంటారు. 

ఏది ఏమైనా, ఇంతపెద్ద సంకల్పంతో కూడిన ఇన్నికోట్ల జనసందోహాన్ని ఇలాంటి పనికి వాడేముందు మన ప్రధానమంత్రి దీనికి సంబంధించిన మొత్తం ప్రహసనాన్ని సోదాహరణంగా వివరించాల్సింది. అలా చేయకపోవటం వలన, ఒక్కొక్కరూ ఒక్కొక్క రకమైన వివరణలు ఇస్తున్నారు. ఐతే, ముందుగా వివరణ ఇవ్వకపోవటం వెనుక మనకు తెలియని సదుద్దేశ్యం ఏదో ఆయనకు వుండివుండొచ్చు.

వేదాలలో వుండే ఇలాంటి గొప్పగొప్ప వైజ్ఞానిక విషయాల సమాహారమే వశిష్ట రామాయణం లేదా యోగవాశిష్టం గా పిలవబడుతున్నది. మరింత వేదవిజ్ఞానం కోసం "గాడ్ రియలైజేషన్" అన్న పేరుతో నేను వ్రాసిన ఉచిత పుస్తకాన్ని ఆన్ లైన్లో చదవటానికీ లేదా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవటానికీ www.VEDAuniversity.com లాగ్ ఇన్ అవ్వగలరు.

అర్ధం చేసుకొని, ఆచరణకు సిద్ధమౌతూ ఇతరులు కూడా ఆచరించేలా సమాయత్తపరచటం కోసం ఈ మెస్సేజుని మీ తోటి భారతీయులలో మీకు పరిచయమున్నవారందరికీ ఫార్వార్డు చేసే వారికి ధన్యవాదములు. 

www.VEDAuniversity.com

bottom of page