top of page

అందరికీ అర్ధమయ్యేలా వేద విజ్ఞాన పరిచయం - 7

ఏడవ అధ్యాయం: వీలున్నన్ని తక్కువ కోరికలతో జీవితాన్ని సాగించమని వేదం ఎందుకు చెప్తోంది? 

విజ్ఞప్తి:

అందరికీ తేలికగా అర్ధంకావటంకోసం ఒక అసహ్యకరమైన ఉదాహరణను ఇవాల్సి వచ్చింది. అర్ధంచేసుకొని క్షమించగలరు.

వేదం ఏమిచెప్తుందంటే, విశ్వంలో జరిగే ప్రతీ సంఘటనకూ దైవశక్తే కారణం. అది మంచి సంఘటన కావచ్చు, చెడ్డ సంఘటన కావచ్చు. మీ జీవితంలో జరిగే ప్రతీ సంఘటనకూ రెండే కారణాలు వుంటాయి:

1- మీరు ఏదైనా ఒక కోరిక కోరుకున్నప్పుడు, మీ అక్కౌంటులో వున్న మొత్తం కర్మనుంచి మీ కోరికను సిద్ధింపచేయటానికి సరిపడు కర్మ విడుదలౌతుంది. దీనినే ప్రారబ్ధ కర్మ అని అంటాము. మీ అక్కౌంటులో వున్న మొత్తం కర్మను మీరు తక్షణమే అనుభవించాల్సిన అవసరం లేదు. కానీ, ప్రారబ్ధకర్మ ఫలితాన్ని మాత్రం వెంటనే అనుభవించాల్సి వస్తుంది. అందుకే కోరికలు లేని జీవితాన్ని గడపమని, తద్వారా ప్రారబ్ధకర్మను పూర్తిగా నియంత్రించొచ్చు అన్నది దాదాపు అందరు స్వామీజీలూ, ప్రవచనకారులూ చెప్తారు. కానీ, ప్రాక్టికల్ గా ఆలోచిస్తే, సంసారజీవితంలో వున్నప్పుడు, కోరికలు సహజం. అందుకే, నేను చెప్పేది ఏమిటంటే, వీలున్నన్ని తక్కువ కోరికలతో జీవనాన్ని సాగిస్తే, వీలున్నన్ని తక్కువ బాధలతో జీవితం సాఫీగా సాగిపోతుంది అని.

2- ఇతరులు కోర్కెలు కోరుకున్నప్పుడు, వాటిని తీర్చాల్సిన భాద్యత కూడా దైవశక్తిదే. వారి వారి కోర్కెలని తీర్చటానికి దైవశక్తి సృష్టించే సంఘటనల్లో కొన్నింటిని మీద్వారా కూడా తీర్చాల్సి రావొచ్చు. అందుకే మీరు ఒకోసారి మీకు సంబంధంలేని పనుల్లోకూడా తలదూరుస్తుంటారు. తద్వారా మీకు కొంత పుణ్యం రావొచ్చు, మీ ప్రారబ్ధ కర్మ కొంత తగ్గొచ్చు.

ఉదాహరణ:
ఒక మధ్యతరగతి ఇల్లాలు దేవుడుని ఇలా ప్రార్ధిస్తుంది. "దేవుడా, నెలతిరక్కుండా నాకు ఒక పాతిక లక్షల రూపాయిలను సంపాదించిపెట్టు తండ్రీ!"

ఆలోచించండి, ఒక మధ్యతరగతి స్త్రీకి అప్పటికప్పుడు పాతిక లక్షలు ఎలా వస్తాయి? కానీ ఆమె కోరికలో చాలా శక్తి వుండటం వలన, దైవశక్తి ఆమె కోరికను తీర్చేసే సంఘటనలను సృష్టిస్తుంది. అందువలన, వారం తిరక్కుండానే ప్రభుత్వ ఉద్యోగి ఐన ఆమె భర్త ఆఫీసులో పనిచేస్తూ గుండెపోటుతో మరణిస్తాడు. తక్షణమే ప్రభుత్వం పాతిక లక్షల రూపాయిలను ఆమెకు ఇస్తుంది.

అందుకే, ఇష్టం వచ్చినట్లు కోరికలను కోరకూడదు. నీ స్థాయికి తగ్గ కోరికలనే కోరుకోవాలి.

ఈ విషయాలకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే, నేను వ్రాసిన 54 పేజీల, "గాడ్ రియలైజెషన్" అన్న ఉచిత పుస్తకాన్ని చదువగలరు. వేదవిజ్ఞానానికీ, ఆరోగ్యానికీ సంబంధించి నేను వ్రాసిన అన్ని ఉచిత పుస్తకాలనూ మీరు ఈ క్రింది వెబ్ సైటు నుంచి ఆన్ లైన్లో చదవొచ్చు, లేదంటే, ఉచితంగానే డౌన్ లోడ్ చేసుకోవచ్చ్హు. క్షమించండి, అన్ని పుస్తకాలూ ఆంగ్లంలోనే వ్రాయబడినవి.

www.VEDAuniversity.com

bottom of page