top of page

అందరికీ అర్ధమయ్యేలా వేద విజ్ఞాన పరిచయం - 4

నాలుగవ అధ్యాయం: దీర్ఘకాలిక రోగాలు, ప్రాణాంతక రోగాలు, డాక్టర్లందరూ చేతులెత్తేసిన కేసుల పరిష్కారం!

 

గమనిక: వ్యాసం మొత్తం చదివిన వారికి ఒకచోట ఒక ఉచిత బహుమతి దొరుకుతుంది. ఈ వ్యాసములో వేద విజ్ఞానముతోపాటుగా కొంత వేదానికి సంబంధములేని విషయాన్ని కూడా చర్చించాల్సి వచ్చింది. ఇలా రోగముపై యుద్ధం చేయాలనుకున్నవారు, ఒక వైపు మెడికల్ ట్రీట్మెంటు తీసుకొంటూ కూడా నేను చెప్పిన పద్ధతిని సమాంతరముగా పాటించవచ్చు. ఈ వ్యాసం ముసలితనాన్ని వీలున్నంత దూరం పెట్టటములో కూడా సహకరిస్తుంది!

 

ఇప్పుడు మిమ్మల్ని మీరు ఈదేశ త్రివిధ దళాధిపతిగా ఊహించుకోండి. గతములో మీరు చేసిన అన్ని యుద్ధాలలోనూ విజయం మిమ్మల్నే వరించింది. కానీ, ఈసారి ఊహించని విధముగా, ప్రపంచములోకెల్లా అత్యంత బలమైన దేశం మీపై యుద్ధాన్ని ప్రకటించింది అనుకోండి. అప్పుడు మీరేమి చేస్తారు. వెంటనే మీరు ఈ క్రింది నిర్ణయాలను తీసుకున్నారు:

 

1-         మీ సైన్యములో కొంత భాగం, మీ పొరుగున వున్న ఒక చిన్న బలహీనమైన దేశముతో ఒక చిన్నపాటి యుద్ధములో ములిగి వుంది. మీరు తక్షణమే ఒక మెట్టు దిగి ఆ పొరుగు దేశముతో రాజీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

2-         మీ సైన్యములో మరికొంత భాగం, మీ సొంత దేశములో కాశ్మీరులో వున్న అంతర్గత శత్రువులతో పోరాడుతున్నది. వెంటనే మీరు కాశ్మీరు వేర్పాటువాద రాజకీయ నాయకులను చర్చలకు పిలిచి సమస్య పరిష్కారానికి కొంత సమయం కోరారు. తద్వారా, కాశ్మీరు నుంచి సైన్యాన్ని ఉపసమ్హరించుకోవటం కుదిరింది.

3-         మీ సైన్యములో మరికొంత భాగం, దేశములోని వివిధ ప్రాంతాలలో రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణములో తలమునకలై వున్నారు. తక్షణమే మీరు వారిని సివిలియన్ పనులనుంచి వెనక్కు రప్పించారు.

4-         మీ సైన్యములో మరికొంత మంది, మీ మిత్రదేశమైన ఆఫ్ఘనిస్తానులో ఆ దేశ సైనికులకు యుద్ధతంత్రములో తర్ఫీదునిస్తున్నారు. తక్షణమే వారందరినీ వెనక్కు పిలిపించారు.

5-         మీ సైన్యములో మరికొంతమంది, ఐక్యరాజ్య సమితి తరపున ఇరాక్ లో పీస్ కీపింగ్ ఫోర్స్ లో భాగముగా సంకీర్ణ సేనలతో కలిసి పనిచేయటానికి వెళ్ళారు. తక్షణమే మీరు వారందరినీ వెనక్కు పిలిపించారు.

6-         మీ సైన్యములో మరికొంత భాగం, సెలవులపై వెళ్ళారు. తక్షణమే మీరు వారి సెలవులను రద్దు చేసి, వారిని యుద్ధభూమికి రప్పించారు.

 

ప్రపంచములోకెల్లా అత్యంత బలవంతుడైన శత్రువుతో పోరాడటానికి, వేరు వేరు పనులలో చెల్లాచెదురుగా వున్న తన సైన్యాన్ని ఆ త్రివిధ దళాధిపతి ఎలా ఏకం చేసారో, సరిగ్గా అలాగే, మీరు కూడా, ఒక ప్రాణాంతకమైన రోగముపై యుద్ధానికి ఎలా సమాయత్తం కావాలో ఇక్కడ వివరిస్తాను:

 

1-         ప్రతి వస్తువుకూ ఒక ప్రైస్ ట్యాగ్ వుంటుంది. ఆ ధరను మీరు చెల్లించాల్సిందే. సరిగ్గా అలాగే, జీవితములో ఏ కోరికనైనా సిద్ధించుకోవాలంటే కూడా, ప్రతి కోరికకూ ఒక ధర వుంటుందనీ, అది ధన రూపములో కాకుండా, అద్యాత్మిక శక్తి రూపములో వుంటుందనీ మీరు గ్రహించాలి. మీ స్థాయికి మించిన కోరిక కోరినప్పుడు, ఆ కోరికను మీకు సిద్ధింపచేసే క్రమములో, దైవశక్తి మీనుంచి పెద్ద మొత్తములో అధ్యాత్మిక శక్తిని హరించివేస్తుంది. ఆ క్రమములో వచ్చేదే అతి పెద్ద రోగం. అందుకనే, ఒక అతి పెద్ద ప్రాణాంతక రోగాన్ని జయించాలనుకున్నప్పుడు, మీరు చేయాల్సిన మొట్టమొదటి పని..........దీర్ఘాయువు మరియూ ఆరోగ్యకరమైన సింపుల్ జీవితాన్ని మాత్రమే కోరుకుంటున్నానని, ఇతర అన్ని కోరికలనూ త్యజించివేస్తున్నాననీ దైవ ప్రార్ధన సమయములో దేవుడికి పదే పదే తెలియచేయటం. తద్వారా, మీ రోజువారీ జీవితములో మీరు ఉత్పత్తి చేసే అద్యాత్మిక శక్తి, మీ ఇతర కోరికలపై దృష్టిని పెట్టటం మాని, ప్రస్తుతం మీయొక్క అతి పెద్ద కోరిక ఐన ప్రాణాంతక రోగాన్ని జయించటముపై తన మొత్తం ఫోకస్ ను పెడుతుంది.

 

2-         మీరు ప్రస్తుతం తింటున్న ఆహారం అత్యంత విషపూరితం. మీరు ఆహారం భుజించిన వెంటనే, కొన్ని కోట్ల, ట్రిలియన్ల కణాలు మీరు తిన్న ఆహారం మీ ప్రాణాలను హరించేయకుండా వుండటం కోసం ప్రతిరోజూ గొప్ప యుద్ధం చేస్తుంటాయి. ఇలాంటి విషపూరితమైన ఆహారముపై ఒక గొప్ప యుద్ధం చేసి, జీర్ణమైన ఆ ఆహారం ద్వారా ఉత్పత్తి అయిన వివిధ ద్రవాల యొక్క పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజెన్ (పీ హెచ్) విలువను బ్యాలెన్సు చేయటం అనే ప్రక్రియ ద్వారా మీరు తిన్న విషాహారాన్ని మంచి ఆహారముగా మీ శరీరములో వున్న అవయవాలు మార్చుకుంటాయి. ఇది ఒక పెద్ద ప్రపంచ యుద్ధం లాంటిది.  మీకు మీ శరీర అవయవాలపై ఏమాత్రం జాలీ, దయా, కరుణా వున్నా, లేదంటే, కనీసం ఒక ప్రాణాంతక రోగాన్ని జయించాలన్నా........మీ శరీరములోని అంతర్గత సైన్యాన్ని ఈ అనవసర యుద్ధం నుంచి వెనక్కు రప్పించి మీ రోగముపై పోరాడేలా చెయ్యాలి. మీ శరీరములో మీకు కనిపించకుండా వుంటూ, మీ మేలుకోరి పనిచేసే సైనికులు, అహర్నిశలూ ఈ అత్యంత ముఖ్యమైన యుద్ధములో నిమగ్నమై వుంటారు. ఆహారము జీర్ణమైన తరువాత మీ శరీరములోని వివిధ ప్రాంతాలలో ప్రవహించే వివిధరకాలైన ద్రవ పదార్ధాల పీ హెచ్ విలువను బ్యాలన్సు చేయటమే ఈ సైనికుల పని. మీరు ప్రతిరోజూ తింటున్న ఆహారములో వున్న ఇనార్గానిక్ మినరల్సును ఆర్గానిక్ మినరల్సుగా మార్చటం ద్వారా మాత్రమే ఈ సైనికులు పీ హెచ్ విలువను బ్యాలెన్సు చేస్తుంటారు. ఒక ప్రాణాంతక రోగముతో మీరు పోరాడుతున్నారని తెలిసి కూడా, మీ శరీరములో వున్న మీ సొంత సైన్యం ఆ రోగముపై ఎందుకు పోరాడటములేదు? ఎందుకంటే, ఈ ప్రాణాంతక రోగం, కొన్ని సంవత్సరాల తరువాతో, లేదంటే, కొన్ని నెలల తరువాతో రోగిని చంపుతుంది. కానీ, ఒకే ఒక్క రోజు మీ శరీరములోని పీ హెచ్ విలువను బ్యాలెన్సు చేయటము నిర్లక్ష్యము చేస్తే, తక్షణమే మీరు మరణిస్తారు. కనుకనే రోగముపై పోరాడాల్సిన మీ సైన్యం, ఆ విషయాన్ని ప్రక్కన పెట్టి, మరింత అత్యవసరమైన శరీర ద్రవాల పీ హెచ్ ను బ్యాలన్సు చేయటం అనే  అత్యవసరమైన పనిపై పూర్తి ఫోకస్ పెడుతుంది. మీకు తెలియదు కానీ, మీ శరీరములోపల ప్రతిక్షణమూ మీరు తింటున్న విషాహారం నుంచి మీ ప్రాణాలను రక్షించటానికి ఎన్నో అంతర్గత అవయవాలు ఈ అత్యంత ప్రమాదకరమైన యుద్ధములో నిరంతరాయముగా పోరాటం సాగిస్తునే వుంటాయి. కానీ, అది ఒక రకముగా ఒక పనికిమాలిన మరియూ అనవసరమైన పని. మీరు మంచి ఆహారాన్ని భుజించటముద్వారా, ఈ గొప్ప సైన్యాన్ని, ఈ అనవసర పని నుంచి తప్పించి, వారిని మీ రోగముపై యుద్ధానికి మరలించవచ్చు. ఇందుకోసం మీరు తక్షణమే ఫ్రోజెన్, ప్రోసెస్సుడు, ప్యాకేజుడ్ ఆహారాన్నీ, మసాలాలు దట్టించి, బాగా వేయించిన ఆహారాన్నీ, మాంసాహారాన్నీ విడనాడాలి. మరోవైపు, వీలున్నన్ని ఎక్కువ ఫలాలను తినటము ద్వారా కూడా మీ శరీరములోని పీ హెచ్ విలువను చక్కగా బ్యాలన్సు చేయవచ్చు. 

 

3-         ప్రతి రాత్రీ మీ సైన్యం చేపట్టే అతి ముఖ్యమైన పని, మీ శరీరములోని ట్రిలియన్ల కొద్దీ వున్న కణాలను శుభ్రపరచి, మరమ్మతులు చేపట్టటం. కానీ, అకారణముగా రాత్రిళ్ళు కూడా భోజనము చేయటమనే దురలవాటు వల్ల, మీరు మీ సైన్యం మొత్తాన్నీ రాత్రంతా కూడా కేవలం అనవసరపు ఆహారాన్ని జీర్ణం చేసి, తద్వారా లభించిన శక్తిని ఏ పనీ చేయకుండా నిద్రిస్తూన్న మీ శరీరము వినియోగించలేకపోవటము వల్ల, తిరిగి ఆ శక్తినంతటినీ కొవ్వుగా మార్చి, శరీరములోని వివిధ ప్రాంతాలకు తరల్చే అనవసరపు పనిలో సైన్యం మొత్తం నిమగ్నమై వుంటుంది. రాత్రివేళ కేవలం ఫలములను మాత్రమే భుజించటము వలన, ఒకటి రెండు గంటలలో మొత్తం జీర్ణ క్రియను ముగించేసి, మిగిలిన సమయాన్ని చక్కగా శరీరాన్ని శుభ్రపరచటానికీ, మరమ్మతులు చేపట్టటానికీ మీ సైన్యం వాడుకుంటుంది.

 

4-         రుచికోసం మీరు వాడే ఉప్పు నిజానికి ఒక అత్యంత ప్రమాదకరమైన విష పదార్ధం. ఈ ప్రమాదకరమైన విషాన్ని ఎక్కడ దాచాలో మీ శరీరానికి అర్ధం కాక, ఆ విషాన్ని పూర్తిగా బయటకు పంపటం సాధ్యం కాక, చాలా వరకూ ఈ విష పదార్ధాన్ని మీ శరీరం మొత్తం వ్యాపించి వున్న ట్రిలియన్లకొద్దీ కణాల ఉపరితలం చుట్టూ ఒక పొరలా వ్యాపింపచేస్తుంది.  జీర్ణమైన ఆహారాన్ని రక్తము ద్వారా కణాలకు చేరవేయాలంటే, ఉప్పు పొర అనబడే ఈ విషపదార్ధాన్ని దాటుకొని మీ సైనుకులు కణము లోపలికి తాము సరఫరా చేసే ఆహారాన్ని పంపించగలగాలి. ఈ అత్యంత కష్టసాధ్యమైన మరియూ అనవసరమైన పనినుంచి మీ సైన్యాన్ని ఉపసమ్హరించాలంటే, మీ ముందు వున్న ఏకైక మార్గం ఆహారములో ఉప్పుని నిషేధించటమే. లేదా వీలున్నంతగా తగ్గించివేయటం. అప్పుడే, ఈ సైన్యమంతా మీ రోగముపై యుద్ధానికి వెళ్ళగలుగుతుంది. లేదంటే, గ్లూకోజ్ రూపములో రక్తములో వున్న ఆహారము, కణముల చుట్టూ వున్న ఉప్పు పొరను దాటలేక, సుధీర్ఘకాలం పాటు మీ శరీరము గ్లూకోజుని రక్తములోనే వుంచేసుకుంటుంది. రక్తములో అదనముగా ఉండిపోయిన గ్లూకోజువల్ల డయాబెటిస్ అనే రోగం వస్తుంది.

 

5- మీ శరీరములోని అంతర్గత సైన్యములో చాలా మంది, ప్రతిరోజూ, మీరు తిన్న ఆహారము, త్రాగిన నీళ్ళూ, పీల్చిన గాలి ద్వారా లభించిన వివిధ పోషక పదార్ధాలనూ, ఆక్సిజనునూ, నీటినీ, హార్మోనులనూ రక్తముతో కలిపి మోసుకుంటూ, మీ శరీరములోని కొన్ని వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, మీ శరీరములోని అన్ని ట్రిలియన్ల కణాలకూ ఆయా పదార్ధాలను సమయానికి అందించాలి. మీ శరీర బరువును తగ్గించుకోవటము ద్వారా, ఈ సైనికులు ప్రయాణించే దూరం చాలా వరకూ తగ్గిపోతుంది. తద్వారా, ఈ సైనికులు ఆదా చేసిన సమయాన్ని, మీ రోగముపై యుద్ధం చేయటానికి వినియోగించగలుగుతారు. అంటే, మీరు ఎంత ఎక్కువ మీ శరీర బరువును తగ్గించుకుంటే, అంత ఎక్కువ మీ అంతర్గత సైన్యం రోగముపై పోరాటానికి వెళ్ళగలుగుతుంది. రోగం ప్రాణాలను హరించివేయటం ఖాయం అని అనుకున్నప్పుడు, మీ శరీరం తనంతట తానే మీ ప్రమేయం లేకుండా శుష్కించిపోతుంది. ఇంకా ప్రాణం పోయే పరిస్థితి రాలేదు కదా అని వేచివుండాకుండా, మీ అంతట మీరే మీ శరీరాన్ని శుష్కింపచేసుకోవాలి. అలాగే, పెద్దగా శారీరక శ్రమ చేయటం మీకు అలవాటులేదు కనుక, మీ శరీరములోని చాలా ప్రాంతాల రక్త ప్రవాహ రహదారులు మూసుకుపోయి వుంటాయి. రక్తము ద్వారా పైన పేర్కొన్న పదార్ధాలన్నింటినీ వివిధ ప్రాంతాలలో వున్న కణాలన్నింటికీ చేరవేసే మీ సైన్యం, రహదారులు మూసుకుపోయిన ప్రాంతాలకు వెళ్ళటం సాధ్యము కాక, ఎంతో కష్టపడుతూంటుంది. యోగాసనములు వేయటము ద్వారా, మీ శరీరములోని అన్ని ప్రాంతాలలోకీ రక్తము చాలా తేలికగా ప్రవేశించగలుగుతుంది. తద్వారా, మీ సైన్యము ఆదా చేసిన పనిగంటలను, మీ రోగముపై యుద్ధానికి వినియోగించగలుగుతారు.

 

ఇన్ని అనవసరపు పనులనుంచి మీ శరీరాన్ని తప్పించటము వలన, తద్వారా ఆదా చేయబడిన విలువైన ఆక్సిజనును మీపై దాడి చేసిన ప్రాణాంతక రోగముపై యుద్ధానికి మీ శరీరం వాడుతుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా, ఎంతో తెలివైన, శక్తివంతమైన మీ శరీరాన్ని తన పని తాను చేసుకోనివ్వటమే. అది మీ జీవన విధానాన్ని పైన వుదహరించినట్లుగా వైదిక జీవన విధానములోకి మార్చుకోవటము ద్వారా మాత్రమే సాధ్యం. వేద విజ్ఞానం నాలుగవ పాఠం సమాప్తం.

 

అంత పెద్ద ప్రాణాంతక రోగముపై యుద్ధానికి కావలసిన మొత్తం విజ్ఞానం ఇంత చిన్న వ్యాసములో ఇమడ్చడం సాధ్యం కాదు కదా. అందుకే, నిజముగా యుద్ధం చేయాలనుకున్న వారు, నేను వ్రాసిన పుస్తకాన్ని పూర్తిగా చదివి అప్పుడు రోగముపై యుద్ధాన్ని ప్రకటించాలి. పుస్తకము పేరు: SELF-HEALING EVEN LIFE-THREATENING DISEASES WITH VEDIC LIFESTYLE.

 

ఈ పుస్తకాన్ని మీరు పూర్తిగా ఉచితముగానే పొందవచ్చు. పోస్టలు ఖర్చు కూడా ఈ వ్యాసకర్తే భరించటం జరుగుతుంది. ఇందుకోసం మీరు చేయవలసిందల్లా, మీ పూర్తి చిరునామాను 9882599999 అన్న నెంబరుకి వ్హాట్సాప్ మెస్సేజుద్వారా పంపించటమే. క్షమించండి. ఈ పుస్తకం ఆంగ్లములోనే వ్రాయబడినది.

 

ఈ రచయితపై ఆర్ధిక భారాన్ని మోపటం ఇష్టం లేనివారు, ఈ పుస్తకాన్ని ఈ క్రింద పేర్కొన్న వెబ్ సైటు నుంచి కూడా పూర్తి ఉచితముగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లేదంటే, తీరిక దొరికినప్పుడల్లా, ఈ క్రింది వెబ్ సైటుకి వెళ్ళి ఒక్కొక్క పేజీ తిరగేస్తూ ఆన్ లైన్ లోనే చదువుకోవచ్చు.

 

www.VEDAuniversity.com

bottom of page