తొలి ఏకాదశి, చాతుర్మాస్య దీక్షలకు సంబంధించిన
వక్రభాష్యాలతోకూడిన మెస్సేజులకు సవరణ:
ఈరోజు తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలలపాటు దేవుడు నిద్రపోతాడని ఒకరూ, వర్షాకాలంలో జబ్బులు రాకుండా వుండటంకోసం ఈ నాలుగు నెలలూ జీవనశైలిని మార్చుకోవటం కోసమే చతుర్మాస్య దీక్ష అని ఇంకొకరూ, అసలు ఏకాదశినాడు ఏ పని మొదలుపెట్టినా దిగ్విజయమే అంటూ మరొకరూ మెస్సేజులు పంపిస్తూ భక్తులను తప్పుదారి పట్టిస్తున్నారు. వాస్తవమేమిటొ ఇప్పుడు చూద్దాం.
ఏ పని ఏ సమయంలో చేస్తే మంచి ఫలితాలను ఆశించవచ్చో వేదకాలం నాటి మహర్షులు పరిశోధన ద్వారా కనుగొన్నారు. తద్వారా డబ్బు సంపాదించటానికి ఏది అనువైన సమయం, మోక్షసాధనకోసం ఏ సమయం సరైనది అని వారు నిర్ణయం చేసారు. సూర్యుడు దక్షిణ దిక్కునుంచి ఉత్తర దిక్కుకి ప్రయాణించే ఆరు నెలల కాలాన్ని ఉత్తరాయణమనీ మరియూ ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రయాణించే మరో ఆరు నెలల కాలాన్ని దక్షిణయనమనీ, ఈ రెండూ కలిపి ఒక సంవత్సరంగా వేదం నిర్ణయించింది. వైష్ణవులందరూ ఉత్తరాయణ కాలంలో జీవనోపాధికోసం పనిచేస్తూ, దక్షిణాయన కాలంలో మోక్షసాధనకు మాత్రమే మొత్తం సమయాన్ని వెచ్చించాలని వేదకాలం నాటి మహర్షులు ఉపదేశించారు. అలాగే, శైవులందరూ దక్షిణాయన కాలంలో జీవనోపాధికోసం పనిచేస్తూ, ఉత్తరాయణ కాలంలో మోక్షసాధనకు మాత్రమే మొత్తం సమయాన్ని వెచ్చించాలని కూడా వారు ఉపదేశించారు. ఒక సంవత్సరం మొత్తం బ్రతకటానికి, ఆరు నెలలకంటే ఎక్కువ పనిచేయాల్సిన అవసరం వస్తే, వైష్ణవులు దక్షిణాయనంలోని మొదటి నాలుగు నెలల కనీస కాలాన్నీ మోక్షసాధనకు వెచ్చించాలనీ, ఆ 4 నెలల కాలాన్నే చాతుర్మాస్య దీక్ష అని అంటారు. అత్యంత శక్తిమంతమైన ఈ నాలుగు నెలల కాలాన్నీ విష్ణువు యోగనిద్రలోనే గడుపుతాడు. యోగనిద్ర కూడా ఒక విధమైన ధ్యానం లేదా తపస్సు వంటిది.
అమెరికా పేరు చెప్పకపోతే భారతీయులు వేదాన్ని కూడా నమ్మే స్థితిలోలేరు కనుక ఇక్కడ మీకో విషయాన్ని చెప్పాలి. కుటుంబాలను వదిలిపెట్టి ప్రపంచంలోని వివిధ దేశాల్లో అత్యంత సంక్లిష్టమైన పరిస్థితులలో విధులు నిర్వర్తించే అమెరికన్ సైన్యానికి పెంటగాన్ యోగనిద్రలో శిక్షణను ఇస్తుంది. తద్వారా ఎలాంటి సమస్యనైనా ఆ సైనికులు తట్టుకొని నిలబడగలుగుతారని వారి పరిశోధనలో తేలింది. సైనికావసరాలకోసం అమెరికా యోగనిద్రలో కొన్ని మార్పులు చేసింది. అందుకని మీరు వారి గ్రంధాలను చదవకండి. స్మామి శివానంద సరస్వతి శిష్యుడైన స్వామి సత్యానంద సరస్వతి యోగనిద్రను ఎలా చెయ్యాలో వారి రచనలలో వివరించారు. అవే చదవండి.
ప్రతిరోజూ కష్టపడితేగానీ పూట గడవనివారికోసం మరియూ ధనాశతో అవసరానికిమించి సంపాదించేవారికోసం మహర్షులు మరొక ఉపాయాన్ని ఉపదేశించారు. ఇలాంటివారు, మోక్షసాధనకై కనీసం నెలకు రెండు రోజులైనా కేటాయించాలని ఉద్బోధించారు. వైష్ణవులందరూ ప్రతీ ఏకాదశినాడూ, శైవులంతా ప్రతీ త్రయోదశినాడూ తప్పనిసరిగా మోక్షసాధనకోసం దీక్షలో గడపాలనేది ఈ షార్ట్ కట్ ఐడియా. అంతేగానీ, అధ్యాత్మికంగా మాత్రమే అత్యంత శక్తిమంతమైన ఈ రెండు రోజులనూ వ్యాపార మరియూ ప్రాపంచిక విషయాలలో విజయ సాధనకోసం వినియోగించకూడదు.
ముఖ్యమైన మాట:
మీరు వైష్ణవులా లేక శైవులా? తదనుగుణంగా మీరు ఆచరించాల్సిన జీవనశైలి ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే, HOW PLANETS INFLUENCE HUMAN ACTIONS? అనే ఉచిత పుస్తకాన్ని www.VEDAuniversity.com నుంచి ఉచితంగానే డౌన్ లోడ్ చేసుకొని చదవగలరు. ఇది అతి చిన్న పుస్తకం. రెండు గంటలలోనే పూర్తిచేయగలరు.
అందరికీ తొలి ఏకాదశి మరియూ చాతుర్మాస ప్రారంభ శుభాకాంక్షలు!